“బి.సి. సమరభేరి”… గోడ పత్రిక ఆవిష్కరణ…
న్యూస్ తెలుగు/వినుకొండ : బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేది మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి పురస్కరించుకొని బి. సి లకు అన్ని రంగాల్లో 52% రిజర్వేషన్స్ కలిపించాలని కోరుతూ బి.ఎస్.పి తలపెట్టిన” ఛలో నరసరావుపేట” కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరుచు ఆదివారం స్థానిక పార్టీ ఆఫీస్ లో గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేరేళ్ళ రాజు, వినుకొండ నియోజకవర్గ నాయకులు మాసిపోగు ఏసోబు, మందా సురేష్ బాబు, గద్దల బాబు, సంపెంగుల ప్రేమ్ అలెగ్జాండర్, అవినాష్, జాన్, దొరడ్ల రాజారావు, ఉయ్యాల మునెయ్య, నూనె వెంకయ్య, అమృతపూడి యోనా…. తదితరులు పాల్గొన్నారు.(Story : “బి.సి. సమరభేరి”… గోడ పత్రిక ఆవిష్కరణ… )