Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ పెద్దలు పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలి 

5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ పెద్దలు పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలి 

5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ పెద్దలు పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలి 

ఆదివాసి సంక్షేమ పరిషత్ (3898/90 ) డిమాండ్

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండలం ముక్కునూరు పంచాయతీ నర్సింగ పేట గ్రామంలో గ్రామ పెద్దల 6వ కోయ పూర్భం సదస్సును ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 5వ షెడ్యూల్ ప్రాంతం గ్రామాలలో ఉన్న గ్రామ పెద్దలు ,పూజారులకు గౌరవ వేతనంగా రూ .10000/రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అలాగే పోలవరం నిర్వాసితులకు భూ నిర్వాసితుల చట్టం 2013 ప్రకారం భూమికి నష్టపరిహారం, ఆర్.ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని , నష్టపరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతనే నిర్వాసిత కాలనీలకు నిర్వాసితులను తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో బినామీ వ్యవస్థను నిర్మూలించాలని , ఏజెన్సీ ప్రాంతంలోకి వలస వచ్చే గిరిజనేతరుల వలసలను నిరోధించడానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీసా చట్టం పటిష్టంగా అమలు చేయడానికి పీసా కమిటీలకు శిక్షణ తరగతులు ఇచ్చి చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు .ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో భద్రత కోసం ” ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం” చేసి ఆదివాసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.* త్వరలో ప్రభుత్వం ప్రకటించే మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇవ్వకముందే ” ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం” చేసిన తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు లేదా షెడ్యూల్ ప్రాంతంలో పోస్టులను మినహాయించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు .ప్రతి ఐటిడిఏ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదివాసి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వ్యాపార రంగంలో శిక్షణ ఇచ్చి ట్రైకార్ ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు .5వ షెడ్యూల్ ప్రాంతంలో చట్టాలు, జీవోలు అమాలుకై ఆదివాసి నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగస్తులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని ,ఈ సందర్భంగా ఆదివాసి సమాజానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి శీలం కృష్ణ, ఉమ్మాల దుర్గారెడ్డి, వ పోడియం లక్ష్మణ్ మండల కార్యదర్శి,ఊకే రాజులు , రవ్వ రాజయ్య పటేల్ , సోడే ముత్తయ్య , సోడే నాగులు ,రవ్వ నాగులు ,రవ్వ వెంకటేష్* ,ఊకే సన్యాసిరావు పీసా కమిటీ ఉపాధ్యక్షులు ,పూజారి పుల్లారావు ముక్కునూరు సర్పంచ్, దుమ్మిరి బ్రహ్మయ్య రామన్నపాలెం పటేల్, కారం సంకూరమ్మ, సవలం పద్మావతి, రవ్వ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story : 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ పెద్దలు పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలి  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!