విజయవంతగా క్రైస్తవ శాంతి ర్యాలీ
క్రైస్తవ సమాజ ఐక్యతను చాటిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప శాంతి ర్యాలీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపంగా వినుకొండ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన శాంతి యుతర్యాలీ విజయవంతంగా జరిగింది. స్థానిక కారంపూడి రోడ్డు లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఆర్.సి.యం జీ వాలయం నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ వెన్నెల సూపర్ మార్కెట్, ఆర్టీసీ బస్టాండు, శివయ్య స్తూపం మీదుగా సాగుతూ తాహ సిల్దార్ కార్యాలయం వరకు సాగింది. తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బందికి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల వృత్తికి సంతాపంగా బాధ తప్త హృదయాలతో వినుకొండ నియోజకవర్గం లోని శావల్యాపురం, ఈపూరు, నూజెండ్ల, బొల్లాపల్లి, వినుకొండ పట్టణ గ్రామీణ ప్రాంతాల తో పాటు ప్రకాశం జిల్లాలోని కురిచేడు, పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం,త్రిపురాంతకం ప్రాంతాల నుండి కూడా క్రైస్తవ నాయకులు, సంఘ కాపర్లు క్రైస్తవ సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ జేఏసీ నాయకులు మాట్లాడుతూ. భారతదేశ అభివృద్ధికి క్రైస్తవులు విద్యా,ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు, రైలు, రోడ్డు, రవాణా మార్గాల తోపాటు, అనేక సౌకర్యాలు కల్పించి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. క్రైస్తవులు ఎవరికి హాని చేసేవారు కాదని, శత్రువును కూడా ప్రేమించే సహృదయం కలిగిన వారిని, అది సమాజంలోని ప్రతి ఒక్కరు అర్థం చేసు కోవాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేసి క్రైస్తవ నాయకులకు, సంఘాలకురక్షణ గా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. శాంతి ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు, క్రైస్తవ నాయకులకు, సంఘస్తులకు, సంఘ కాపరులకు, క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. (Story : విజయవంతగా క్రైస్తవ శాంతి ర్యాలీ)