ప్రజలే దేవుళ్లుగా రాజకీయాలకు కొత్తభాష్యం చెప్పిన తెలుగుదేశం
వినుకొండలో ఘనంగా తెదేపా 43వ ఆవిర్భావ వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ బాటలో దేశంలోనే రాజకీయలకు కొత్త భాష్యం చెప్పిన పార్టీ తెలుగుదేశం అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సంక్షేమనికి నాంది పలికారని, సామాజిక న్యాయానికి అర్థం చెప్పారన్నారు. తెలుగు వారికి ఆస్తిత్వ చిహ్నంగా మన ఖ్యాతిని దశదిశలా చాటిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. వినుకొండలో శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా జివి మాట్లాడుతూ. ఆనాడు, ఈనాడు, ఏనాడై న ప్రజలందరి కీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పేదలకుకూడు ,గూడు, గుడ్డ, సంక్షేమ పథకాల రూపంలో పార్టీ రికార్డు సృష్టించిందన్నారు. పథకాలు అందించడంలోనూ కొత్తబాట చూపిందన్నారు. నాడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం అందస్తే చంద్రబాబు ఉచితంగా ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు తెచ్చిన అనేకపథకాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. సవాళ్లు, సంక్షోభాలకు ఎదురు నిలిచిన పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలకు కొండంత అండగా ఉందన్నారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మహిళలకు ఆస్తిహక్కు వచ్చిందని, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితులకు చేయూతనిచ్చి ఉన్నతస్థానాలకు తీసుకువెళ్లామన్నారు. ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నా గ్రామగ్రామాన అభివృద్ధి, సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం జరిగాయన్నారు. ఈ సందర్భంగానే వినుకొండ ప్రాంత ప్రజల అభివృద్దే ఆశయం, పల్నాడు సమగ్ర వికాసమే ధ్యేయంగా పనిచేస్తానని మాట ఇస్తున్నాన్నారు. అందుకు ధనిక, పేద అసమానతలు తగ్గించాలని, పేదలను అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్లాలలని చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన బాటలోనే తాను కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ, రాజ్యాంగ విలువలను కాపాడుతున్న పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. అందరితో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని నాగేశ్వరరావు, కౌన్సిలర్ షేక్ షకీల , పట్టణ అధ్యక్షులు అయూబ్ ఖాన్ , పీవీ సురేష్, షమీంఖాన్, లాయర్ సైదారావు, మీసాల శ్రీనివాసరావు, పత్తి పూర్ణచంద్రరావు, నరసింహారావు, నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.(Story : ప్రజలే దేవుళ్లుగా రాజకీయాలకు కొత్తభాష్యం చెప్పిన తెలుగుదేశం )