తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే అనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు
లక్ష్మీపురం తెలుగుదేశం పార్టీ పంచాయతీ కమిటీ
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు డివిజన్లోని ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలో *ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది.ముందుగా లక్ష్మీపురం సెంటర్లో అన్న ఎన్టీఆర్ కి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ జెండా, ఆవిష్కరించారు. ప్రతిజ్ఞ నిర్వహించారు అనంతరం *కణితి మధు ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ:- సామాజిక న్యాయం కోసమే ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని అన్న ఎన్టీఆర్ సుస్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజల యోగక్షేమాల కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది అని భవిష్యత్ తరాల బాగుకోసమే సీఎం చంద్రబాబు గారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామకమిటీ అధ్యక్షులు ఉండేటి వెంకన్న, గ్రామ కమిటీ సెక్రటరీ తలారి కాంతారావు, ఉండేటిరమేష్, వాసంశెట్టి రామకృష్ణ, పనితి భూపతిరావు,కందులకోటయ్య,కొట్టే ఏసులు,తోటమల్ల శీను,మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. (Story : తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే అనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు)