గ్రామీణ రహదారులకు మహర్దశ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల అత్యవసర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం HAM పథకం నుంచి R&B, పంచాయతీరాజ్ శాఖల ద్వారా రూ. 11.44 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ దామోదర రాజనర్సింహ కి, రోడ్లు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క కి , జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కు వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు
ఖిల్లా ఘణపురం నుంచి మహ్మద్దూస్సేన్ పల్లి గ్రామానికి రహదారి నిర్వహణ నిమిత్తం రూ 1కోటి మంజూరు. పెద్దమందడి మండలం వెల్టూర్ జాతీయ రహదారి నుంచి వయా గట్లఖానాపురం సోళీపురం వరకు రూ. 2.51 కోట్లు గోపాల్పేట మండలం PWD రోడ్డు నుంచి, ZP రోడ్డు వరకు వయా పొలికెపహాడ్ రూ.1.51 కోట్లు చిట్యాల గ్రామం నుంచి చిట్యాల తండా వరకు 92 లక్షలు రేవల్లి మండలం నాగపూర్ లూప్ రోడ్ నుంచి నాగపూర్ వరకు రూ 1.50 కోట్లు ఖిల్లా గణపురం R&B రోడ్డు నుంచి వయా సోళీపూర్,ఉప్పరపల్లి, సురాయపల్లి, జగ్గయ్యపల్లి, సుంకరయ్య పల్లి, కందూరు వరకు రూ 1.50 కోట్లు
ఖిల్లా ఘనపురం మండలం సూరాయపల్లి బ్రాంచ్ రోడ్ నుంచి సూరాయపల్లి గ్రామం వరకు రూ. 80 లక్షలు వనపర్తి నుంచి పెబ్బేరు రోడ్డుకు రూ. 70 లక్షలు వనపర్తి నుంచి వయా చిట్యాల బుద్ధారం రోడ్డు వరకు రూ. 30 లక్షలు గోపాల్పేట నాగర్కర్నూల్ వయా పోలికేపహాడ్ రోడ్డుకు రూ. 70 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే పనులు ప్రారంభమవుతాయని ఆయా గ్రామాల మధ్యన ఈ రహదారుల మరమత్తుతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే వివరించారు. (Story : గ్రామీణ రహదారులకు మహర్దశ)