ముస్లిం మత పెద్దలు , కాలనీ పెద్దలకు సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : రంజాన్ సందర్భంగా 28వ వార్డు వెంగళరావు కాలనీ, అక్సా మసీద్ పెద్దలకు ముస్లిం పవిత్ర మైరూమా శాలువాతో వెంగల్ రావు కాలనీ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ఐక్యవేదిక సభ్యులు సన్మానించారు.
రంజాన్ శుభ సందర్భంగా సన్మానిస్తూ, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ఐక్యవేదిక సభ్యులు 28వ వార్డులోని ప్రతి ముస్లింల ఇంటికి తిరిగి ఉపవాస దీక్ష విరమించడానికి పళ్ళను, ఖజురాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, బురాన్, అబ్దుల్ జబ్బర్, జానీ బాయ్, అబ్దుల్ హనాన్, అజార్, జహీర్, మక్సోద్, బేగ్, వెంకటేశ్వర్లు, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, శివకుమార్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ముస్లిం మత పెద్దలు , కాలనీ పెద్దలకు సన్మానం)