విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ తెలుగు / వినుకొండ : విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యడవల్లి వెంకటసుబ్బయ్య శర్మ 80వ జన్మదినోత్సవం సందర్భంగా వారి ధర్మపత్ని సావిత్రి, కుమారుడు ప్రసాద్, కోడలు శిరీష ఈ కార్యక్రమానికి సహకారం అందించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. గత 10 సంవత్సరాలుగా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 84 అన్నదాన కార్యక్రమాలు, 80 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సభ్యుల సహాయ, సహకారాలతో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. నాగేంద్రుడు, ఏ. కోటేశ్వరరావు, టి శేషయ్య, బాలాజీ సింగ్, బిపిఎస్ సుందర్రావు, పి నారాయణ రావు, యం వి. శర్మ, శిష్ట మల్లికార్జున శాస్త్రి, కృష్ణమూర్తి, రాఘవయ్య, దీక్షితులు శంకరరావు, ఆది రాములు, సిహెచ్ సుబ్బారావు, దుబ్బల దాసు తదితరులు పాల్గొన్నారు.(Story :విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం)