ప్రజల కష్టంలో ఆత్మబంధువులా ఆదుకుంటున్న సీఎం
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జీవీ
30 మంది బాధితులకు రూ.24.40 లక్షల విలువైన చెక్కులు పంపిణీ
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలోని ప్రజల ప్రతికష్టంలో ఆత్మబంధువులా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా క్రమం తప్పకుండా అందిస్తున్న ఆర్థిక సహాయాలే అందుకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అధికారం అంటే అనుభవించేది కాదు సేవ చేసే అవకాశం అన్న భావనతో ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటామన్న మాట మేరకు ప్రతిఒక్కరిని ఆదుకుంటూ వస్తున్నామన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్ధికసాయం చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన మొత్తం 30 మంది బాధితులకు 24.40 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలు జీవీ ఆంజనేయులు, సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జివి మాట్లాడుతూ. కష్టం చెప్పుకుంటే చాలు సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారని గుర్తు చేశారు. అలా ఇప్పటివరకు 11,626 మందికిపైగా రూ.157 కోట్లకు మించి ఆర్థిక సాయం చేశారని, సరాసరిన ఒక్కొక్కరికి సుమారు లక్షా 36 వేల సాయం చేశారని, సీఎం చంద్రబాబు మానవతా దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజల కోసం అధికారంలోకి వచ్చి… వారి అండగా ఉంటున్న ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, నాయకులు పాల్గొన్నారు. (Story : ప్రజల కష్టంలో ఆత్మబంధువులా ఆదుకుంటున్న సీఎం )