అపర అన్నమయ్య గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు ఘన నివాళి
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రముఖ టీటీడీ ఆస్థాన సంగీత విధ్వంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 1976 లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరి 2006లో ఉద్యోగ విరమణ పొందారు. అన్నమయ్య కీర్తనలు ఆలపించడంలో స్వరపరచడంలో రికార్డు చేయడంలో పుస్తక ప్రచురణలో జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఎంతో ఆత్మీయంగా పలకరించే వారు గరిమెళ్ళ అస్తమయం భక్తి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆయన ఎన్నెన్నో అన్నమాచార్య సంకీర్తనలను సేవా చిత్తంతో ఎంతో మధురంగా పాడి జన బహుల్యములోకి వ్యాప్తి చేసి అభినవ అన్నమయ్య గా ప్రాచుర్యం పొంది ఎంతోమందికి స్ఫూర్తి దయకంగా నిలిచారంటూ పట్టణానికి చెందిన ప్రతిభ గానకళా శిక్షణ కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు సంగీత సద్గురువులైన పి. రాజు, మరియు పట్టణ సంగీత కళాకారులు గాయకులైన ఎల్. రవీంద్ర ,ఎస్.కె. బాబు, శ్రీరాద్య, అశ్రిత, అభిషేక్, గురువులు, తదితరులు తమ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపార. (Story : అపర అన్నమయ్య గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు ఘన నివాళి)