స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం
న్యూస్ తెలుగు / వినుకొండ : మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ఉన్న అన్ని హోల్ సేల్ వ్యాపారస్తులకు ప్లాస్టిక్ నిషేధ సర్కులర్స్ ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా (120 మైక్రాన్స్ కంటే తక్కువ) ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ధర్మకోల్స్ ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, ప్లాస్టిక్ జెండాలు మొదలైనవి అమ్ముటకు ప్రభుత్వం నిషేదించడమైనది. మంగళవారం పట్టణంలోని అన్ని ప్లాస్టిక్ హోల్ సెల్ మరియు రిటైల్ షాపుల నందు రైడ్ నిర్వహించి ఈ విషయంపై అవగాహన కల్పించడం జరిగినది. మరియు నిషేధించబడిన సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఇతర నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు అమ్మిన లేదా వినియోగించిన, అటువంటి వారిపై 5,000 రూపాయలు జరిమానా మరియు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు మరియు మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. (Story : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం)

