దుష్ప్రచారాల్లో జగన్, వైకాపాకు ఆస్కార్ ఆవార్డులు ఇవ్వాలి
విద్యా ప్రమాణాలు నాశనం చేసి, ఫీజులు ఎగ్గొట్టి దొంగ ధర్నాలా?
విద్యా వ్యస్థపై చర్చలో అసెంబ్లీ వేదికగా జగన్‌పై ధ్వజమెత్తిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో తప్పుడు, దుష్ప్రచారాల్లో జగన్, వైకాపాకు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలంటూ ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాడు బాబాయిని హత్య చేసి పక్కవాళ్ల పైకి తోసేసే ప్రయత్నం చేశారని, అదే రీతిలో 5 ఏళ్లూ విద్యా ప్రమాణాలు నాశనం చేసి. ఫీజులు ఎగ్గొట్టి, ఇప్పుడు ధర్నాలు చేస్తామంటున్నారని వైకాపా, జగన్ తీరుని తూర్పారా బట్టారు. గురువును దైవంగా భావించే సమాజంలో టీచర్లను మద్యం షాపులు, మరుగుదొడ్ల వద్ద కాపలా పెట్టి మళ్లీ ఏం మొహం పెట్టుకుని మాట్లాతున్నారో అర్థం కావడం లేద ని ఎద్దేవా చేశారు. మంగళనారం అసెంబ్లీలో విద్యావ్యవస్థపై చర్చ సందర్భంగా వైకాపా, జగన్ తీరుపై విరుచుకు పడ్డారు. నాడు-నేడు పేరు చెప్పిన రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. 2018 వరకు దేశంలోనే 3వ స్థానంలో ఉన్న విద్యా ప్రమాణాలు 2024నాటికి పాతాళానికి పడిపోవడం, అసర్ నివేదికలే సాక్ష్యమన్నారు. జగన్ విధానాల దెబ్బకి 2.43 లక్షల మంది డ్రాపౌట్ అయ్యారని, 12 లక్షలమంది ప్రభుత్వబడులు వదిలేసి ప్రైవేటులో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ తరగతి విద్యార్థి కనీసం 2వ తరగతి పాఠాలు చదవలేని దుస్థితి తెచ్చిన వారికి చదువు విలువ తెలుసా అని ప్రశ్నించారు. 117 జీవో తో వేలాది బడులు మూసేయించారని, ఎయిడెడ్ పాఠశాలలకు ఉరి బిగించారని వాపోయారు. 40లక్షల మంది అమ్మఒడి ఎగ్గొట్టారని, కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం కోసం 9 వేల 407 కోట్లు ఇచ్చామన్నారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, జీవో 117 రద్దు చేసినందుకు టీచర్లు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. జగన్ మధ్యాహ్న భోజన పథకం బిల్లులు కూడా ఇవ్వకుండా ఏడిపించారని, జూనియర్ కాలేజీల్లో మొత్తానికి ఆ పథకమే మూసివేశారన్నారు. పుస్తకాలు ఇవ్వడం ఆపేశారని గుర్తు చేశారు. ఆ బకాయిలు కూటమి ప్రభుత్వం కడుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థు లకు కాస్మోటిక్స్ ఛార్జీలు జగన్ ప్రభుత్వం బకాయిలు పెడితే ఆ రూ. 22 కోట్ల 52 లక్షలు కూట మి వచ్చాకే కట్టామన్నారు. మధ్యాహ్న భోజనానికి రూ. 110 కోట్లు బకాయిలు చెల్లించామని తెలిపారు. ఇంత జరిగాక కూడా జగన్ ఫీజుల పేరిట ధర్నాలు అంటుంటే మొగుడుని కొట్టి మొగశాలకు ఎక్కినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇదే కొనసాగితే జగన్‌కు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చాక మళ్లీ విద్యావ్యవస్థను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారని, దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందనే విషయం గుర్తెరిగి చర్యలు తీసుకుంటారని తెలిపారు. విద్యార్థుల్లో విలువలు, బాధ్యత, దేశభక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని, నైతిక విలువలను కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి మార్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. (Story : దుష్ప్రచారాల్లో జగన్, వైకాపాకు ఆస్కార్ ఆవార్డులు ఇవ్వాలి)