ఈ హోలీ పండుగను
“దిల్ రూబా”తో సెలబ్రేట్ చేసుకుందాం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాట్లాడుతూ – “దిల్ రూబా” విలువలతో కూడిన ఫ్రెష్ లవ్ స్టోరీ. చాలా ఇంటెన్స్ గా మూవీ ఉంటుంది. ఈ సినిమాను ది బెస్ట్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేందుకు టీమ్ అంతా కష్టపడ్డాం. హోలీ రోజున మీరంతా “దిల్ రూబా”ను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డీవోపీ డానియేల్ విశ్వాస్ మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో కిరణ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ మీకు బాగా నచ్చుతుంది. అలాగే డైరెక్టర్ విశ్వకరుణ్ గారు సినిమా కథను ఎంత బాగా చెప్పారో అంత బాగా రూపొందించారు. రుక్సర్, క్యాతీ డేవిసన్ బాగా నటించారు. సిద్ధు క్యారెక్టర్ ను మా డైరెక్టర్ గారు రాసిన విధానం, కిరణ్ గారు పర్ ఫార్మ్ చేసిన తీరు మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ – “దిల్ రూబా” ట్రైలర్ కు మీరు ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఒక ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా నాకున్న అనుభవంతో చెబుతున్నా “దిల్ రూబా” కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుంది. 2019లో కిరణ్ నాకు ఈ కథ పంపించాడు. కథ బాగా నచ్చింది. అయితే ఇప్పటి ప్రేక్షకులకు సినిమాను గ్రాండియర్ గా చూపిస్తేనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సారెగమా వారితో అసోసియేట్ అయ్యాం. “దిల్ రూబా” సినిమా కంటెంట్ మీరు చూస్తున్నారు ఎంత రిచ్ గా ఉందో. హీరోయిన్స్ ఇద్దరూ మిమ్మల్ని కంటతడి పెట్టిస్తారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ అంత బాగుంటుంది. దర్శకుడు విశ్వకరుణ్ కథ నెరేషన్ తో ఆకట్టుకుంటాడు. మాకు ఒక మంచి మూవీ చేశాడు. డీవోపీ డేనియల్, ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్..మ్యూజిక్ చేసిన సామ్ సీఎస్ గారు.ఇలా టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. నా ఫ్రెండ్స్ కొందరు ఈ ప్రాజెక్ట్ కోసం సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 14న హోలీ రోజున మా “దిల్ రూబా” సినిమా థియేటర్స్ లో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను. అన్నారు.
డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ – “దిల్ రూబా” టీజర్ మీ ఆదరణ పొందింది. ఇప్పుడు ట్రైలర్ కూడా బాగుందని మీరు చెబుతుండటం సంతోషంగా ఉంది. ప్రేమ గొప్పది కాదు అది ఇచ్చే వ్యక్తి గొప్పవాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తున్నాం. మీ అందరికీ నచ్చేలా మూవీ ఉంటుంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమాలో మ్యాగీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఇంత మంచి రోల్ లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ విశ్వకరుణ్ గారికి థ్యాంక్స్. అలాగే హీరో కిరణ్ గారు ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ మూవీలో సిద్ధు, మ్యాగీ లవ్ మీకు హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. ట్రైలర్ లో కంటే మూవీలో నా మ్యాగీ క్యారెక్టర్ మీకు ఇంకా బాగా నచ్చుతుంది. హోలీ పండుగను మా మూవీతో మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అన్నారు.
హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమాలో అంజలి క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ విశ్వకరుణ్ కు థ్యాంక్స్. ఈ సినిమా చూసే ప్రతి ఆడియెన్ అమ్మాయి అయితే అంజలిగా అనుకుంటారు, అబ్బాయిలు సిద్ధుతో పోల్చుకుంటారు. మా ఇద్దరి క్యారెక్టర్స్ కు అంతగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా. ఈ మూవీకి హీరో కిరణ్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మా మూవీ సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. థియేటర్స్ లో చూస్తే మీరు ఇంకా ఆ పాటల్ని ఇష్టపడతారు. మా ప్రొడ్యూరస్ సారెగమా, శివమ్ సెల్యులాయిడ్స్ వారికి థ్యాంక్స్. ఈ నెల 14న థియేటర్స్ లో “దిల్ రూబా” చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టీజర్, సాంగ్స్ ను హిట్ చేశారు. మాకు చాలా కాన్ఫడెన్స్ ఇస్తున్నారు. ప్రేమ గురించి ఒక కొత్త పాయింట్ ఈ మూవీలో చెప్పాం. లవ్ బ్రేకప్ అయితే లవర్ నుంచి దూరంగా ఉంటాం. శత్రువులా చూస్తాం. కానీ “దిల్ రూబా” చూశాక మీ అభిప్రాయం మారుతుంది. ఇందులో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక క్యూట్ ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్స్ లవర్ ఉంటారు. మీకు వీలైతే ఈ సినిమాను మీ ఎక్స్ లవర్ తో చూడండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫీలింగ్ తో వస్తారు. “దిల్ రూబా” గురించి ఫస్ట్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ రవి గురించి. ఆయన 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. రవి గారి స్ట్రగుల్ చూశాక డిస్ట్రిబ్యూటర్స్ మీద నాకు గౌరవం పెరిగింది. ఈ సినిమా కోసం తన శక్తి మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు మా ప్రొడ్యూసర్ రవి. మూడేళ్లుగా ఈ మూవీని ది బెస్ట్ గా ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. మార్చి 14 రిలీజ్ డేట్. పరీక్షల టైమ్, ఐపీఎల్ ఉంది కాబట్టి మా అందరికీ కాస్త టెన్షన్ ఉంది. అయితే స్టూడెంట్స్ పరీక్షలు బాగా రాయండి, ఆ తర్వాత మా మూవీ చూడండి. మీ అందరికీ మా టీమ్ నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ హోలీ పండుగను దిల్ రుబాతో మరింతగా సెలబ్రేట్ చేసుకుందాం. “దిల్ రూబా”లో మ్యాజికల్ మూవ్ మెంట్స్ ను థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, సత్య, తదితరులు
టెక్నికల్ టీమ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్
ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ – సామ్ సీఎస్
నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్
రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్
(Story : ఈ హోలీ పండుగను “దిల్ రూబా”తో సెలబ్రేట్ చేసుకుందాం )