ఆర్థిక భద్రతపై శాండ్‌విచ్ జనరేషన్ తీరు ఇదీ!
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: ఎంత సంపాదించినా ‘ఇది ఎప్పుడూ సరిపోదు’ అనే భావనతో 60% మంది శాండ్‌విచ్ జనరేషన్ అభిప్రాయపడుతున్నారని ఎడెల్విస్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన అధ్యయనం వెల్లడిరచింది. ప్రస్తుతం 35-54 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులను శాండ్‌విచ్ జనరేషన్ అంటారు, వీరు రెండు తరాల కొరకు ఆర్ధికంగా సహాయపడతారు-తమ వృద్ధులు అవుతున్న తల్లిదండ్రులు, పెరుగుతున్న పిల్లలు వీరి జీవితంలో ప్రాధాన్యతను కలిగిఉంటారు. ఎడెల్విస్ లైఫ్ లైఫ్ ఇన్సూరర్, యూగవ్ సహకారంతో, 12 నగరాల వ్యాప్తంగా ఈ తరంలో 4,005 మంది రెస్పాండెంట్స్‌ను వారి ధోరణులు, నమ్మకాలు మరియు ఆర్ధికంగా సిద్ధంగా ఉన్న స్థాయిలను అర్థంచేసుకోవడంపై సర్వే చేశారు. శాండ్‌విచ్ జనరేషన్‌వారు ‘కోరికల’ ఖర్చుతో ‘అవసరాలు’ తీరని, కోరుకున్న జీవితాన్ని అందిస్తూ, ఆరోగ్యసంరక్షణ, విద్య వంటి అవసరాలను అందించాలని కోరుకుంటున్నారని ఎడెల్విస్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో సుమిత్‌రాయ్ తెలిపారు. ఇది ప్రాథమికంగా వారి ఆర్ధికంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రభావితం చేస్తుందని, వారు తరచూ తమ సొంత కలలను వెనక్కు వదిలేస్తుంటారని, దానితో భవిష్యత్తు కొరకు వారు సిద్ధంగా లేరనే భావనకు లోనౌతారని తెలిపారు.(Story : ఆర్థిక భద్రతపై శాండ్‌విచ్ జనరేషన్ తీరు ఇదీ!)