జగన్‌కు ప్రజల గుణపాఠం..
సీఎం అర్హత లేనందుకే 11 సీట్లు!
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, వైఎస్ జగన్ పై కౌంటర్ ఇచ్చారు
న్యూస్ తెలుగు /వినుకొండ : అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని, ప్రజలు జగన్‌ను సీఎంగా అనర్హుడిగా భావించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. జీవితకాలానికి సరిపడేలా ప్రజలు గుణపాఠం చెప్పినా పవన్ కల్యాణ్ విషయంలో జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదని. పవన్ కల్యాణ్ “జగన్‌ను పాతాళానికి తొక్కుతా” అని చెప్పి చూపించారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాదని తెలిసి జగన్ డ్రామాలు ఎందుకు ప్రశ్నించారు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న జగన్ హయాంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిందని నిలదీశారు. ప్రజలు తమ అసంతృప్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించి పట్టభద్రులను టీడీపీకి ఓటు వేయించారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుప్రకటించారు. (Story : జగన్‌కు ప్రజల గుణపాఠం..)