బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
వెంకటాచారి ఎంపిడిఓ ఖిల్లా ఘనపురం మండలం
న్యూస్‌తెలుగు/ఘనపురం మండలం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపిడిఓ వెంకటాచారి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడారు బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం అని తెలిపారు. ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 సంప్రదించాలని సూచించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ రాజేష్ కుమార్, బాలల పరిరక్షణ విభాగం నరేష్ ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి)