పారమ్మ కొండ జాతరకు ఏర్పాట్లు
న్యూస్ తెలుగు /సాలూరు : భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారమ్మ కొండ జాతర వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రంగం అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం పాచిపెంట మండలంలో గల చీపురు వలస గ్రామంలో ఉన్న పారమ్మ కొండ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా పారమ్మకొండ జాతర ఏర్పాట్లను పరిశీలించారు.అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు .భక్తుల రద్దీ, ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, శిబిరాలు, పోలీసు భద్రత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించి, మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. పారమ్మకొండ జాతర వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసేలా కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మంచాల పారమ్మ, శ్రీను,కృష్ణ బుజ్జి, సూర్యనారాయణ, కనకారావు తదితరులు పాల్గొన్నారు. (Story : పారమ్మ కొండ జాతరకు ఏర్పాట్లు)