మెకానిక్ ను పరామర్శించిన పిడిక రాజన్న దొర
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు పట్టణ వాస్తవ్యులు కంచుపిల్లవెంకటేశ్వరరావు(మెకానిక్) ను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర. పట్టణంలో గల నెయ్యిల వీధిలో ఉంటున్న వెంకటేశ్వరరావుకు ఇదివరకు ఆరోగ్య రీత్యా సర్జరీ అయిందని తెలుసుకొని నేరుగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వెంకటేశ్వరరావు ,కుటుంబ సభ్యులు కు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమం లో టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ ప్రచార జిల్లా అధ్యక్షులు గిరి రఘు నియోజక వర్గ వైఎస్ఆర్సీపీ దివ్యంగుల విభాగ అధ్యక్షులు అచ్చిబాబు , మేడిసెట్టి అప్పలనాయుడు టెక్కలి ధర్మ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. (Story : మెకానిక్ ను పరామర్శించిన పిడిక రాజన్న దొర)