12న బీమోలు కు సిపిఐ నేత కె రామకృష్ణ రాక
బీమోలు పట్టాదారులకు న్యాయం జరిగే వరకూ సిపిఐ దశలు వారి పోరాటం
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
న్యూస్‌తెలుగు/చింతూరు : గత 50 సంవత్సరాలుగా భీమలిలో న్యాయం కోసం పట్టాదారులు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా భీమోలు భూములు పరిశీలించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ ఈనెల 12న బుధవారం విచ్చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు.
బుధవారం సాయంత్రం గోపాలపురం ఆర్ అండ్ బి బంగ్లాలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలపురం మండలం బీమోలు గ్రామం పట్టాదారుల భూపారాటం ఏళ్ల తరబడి సాగుతుందని అన్నారు సిపిఐ పోరాట ఫలితంగా 1973లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం భూసంస్కరణ చట్టం చేయడానికి సిపిఐ కారణమన్నారు 1976 లో అప్పటి కొవ్వురూ ఆర్డీవో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన 143 మందికి సీలింగ్ మిగులు భూమిని 342 ఎకరాలు పంపిణీ చేసిందన్నారు. ఐదు సంవత్సరాలు పాటు పట్టాదారులు సాగు చేస్తుండగా భూస్వామి మారెడ్డి జగ్గారావు కొడుకు బుచ్చిరాజు కుట్రపూరితంగా 11 మంది కౌలుదారులను సృష్టించి కొవ్వూరు కోర్టులో పిటిషన్ వేశారన్నారు .అనంతరం హైకోర్టు సుప్రీంకోర్టు కౌలుదారులు వెళ్లిన ఆనాడు రెవిన్యూ అధికారులు భూస్వామికి అమ్ముడై పట్టాదారులకు అన్యాయం చేశారన్నారు. గత 50 సంవత్సరాలుగా పట్టాదారులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టాదారులకు న్యాయం చేయడం కోసం సిపిఐ రెండు మార్గాలను ఎంచుకుంది ఒకటి ప్రజా పోరాటంతోనే సాధించాలని మరొకటి కోర్టుల లో న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు అందులో భాగంగా ఫిబ్రవరి 12వ తారీఖున బుధవారం ఉదయం బీమోలు గ్రామానికి సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులూ కామ్రేడ్ అక్కినేని వనజ హాజరవుతున్నారని తెలియజేశారు ఆ భూములు పరిశీలిస్తారని అనంతరం స్థూపం వద్ద బహిరంగ సభ ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు.
ఈ సభకు గోపాలపురం మండల ప్రజలు అలాగే భీమాలు గ్రామ ప్రజలు పట్టాదారులు సంఘీభావంగా అన్ని వర్గాల వాళ్ళు తరలిరావాలని సిపిఐ పిలుపునిస్తుంది. ఈ
విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్, తోట లక్ష్మణ్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ నాగేశ్వరరావు, సీపీఐ భీమిలు నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. (Story : 12న బీమోలు కు సిపిఐ నేత కె రామకృష్ణ రాక)