కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే నేతాజీ హాస్పిటల్ లక్ష్యం
డాక్టర్ హేమంత్ కాకర్ల
న్యూస్‌తెలుగు/చింతూరు : ఉచితంగా వైద్య శిబిరం విజయవంతం అయ్యింది.
భద్రాచలం నేతాజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చింతూరు గ్రామంలోని క్రికెట్ గ్రౌండ్ వారపు సంత ప్రాంగణంలో నందు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ హేమంత్ కాకర్ల, డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి లు రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకలు వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్ కాకర్ల మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం ప్రజలకోసం కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించానే లక్ష్యంతో ఆర్థోపెడిక్ లాప్రోస్కోపిక్ సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మా హాస్పిటల్ నందు లాప్రోస్కోపీ వైద్య సేవలు తక్కువ కోత , తక్కువ ఖర్చు , త్వరగా కోలుకునే లాగా అత్యాధునిక వైద్య చికిత్సలతో పాటు ఆర్థోపెడిక్ వైద్య సేవలు ఎముకలు విరిగిన వారికి ఆపరేషన్లు, అలాగే మోకాళ్ళ కీళ్ల మార్పిడి ఆపరేషన్లు , కీళ్లవాతానికి సంబంధించిన సమస్యలకు, యాక్సిడెంట్ కేసులకు మరియు అన్ని ఎమర్జెన్సీ కేసులకు 24 గంటలు వైద్యం అందించబడనని తెలిపారు. కావున ప్రజలందరూ మా యొక్క వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు ఎమ్మెస్ ఆర్థో డాక్టర్ హేమంత్. కాకర్ల, ప్రముఖ చిన్న పిల్లల వైద్యునిపుణులు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి, శిబిరానికి వచ్చిన 220 మంది ప్రజలకు అవసరమైన వారికి 2500 రూపాయల విలువగల ఎముకల సాంద్రత బిఎండి పరీక్ష, అలాగే గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష, షుగర్ పరీక్ష ఉచితంగా నిర్వహించే ఉచితంగా మందులు అందజేయడం జరిగినది.మేము ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి సహకరించి, విజయవంతం చేసినందుకు ప్రజలకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వహకులు జక్కిరెడ్డి. శ్రీనివాస్ రెడ్డి , డాక్టర్ నరసింహారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. (Story : కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే నేతాజీ హాస్పిటల్ లక్ష్యం)