Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పమిడిపాడులో వైభవంగా తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం

పమిడిపాడులో వైభవంగా తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం

పమిడిపాడులో వైభవంగా తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం

శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ లీలావతి ప్రత్యేక పూజలు

న్యూస్ తెలుగు /వినుకొండ : నూజెండ్ల మండలం పమిడిపాడులో తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సతీమణి, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా పాల్గొన్నారు. అమ్మవారికి పూజల అనంతరం అర్చకులు వారందరికీ వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్‌ సతీమణి లీలావతి మాట్లాడుతూ. అందరికీ మేలు జరగాలని, జీవీ ద్వారా… ప్రభుత్వం ద్వారా… తమ సంస్థలు, శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్థానికంగా చేయూత లభించాలనే ప్రార్థించినట్లు తెలిపారు. (Story : పమిడిపాడులో వైభవంగా తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!