పల్నాడు జిల్లాలో విద్యా సదస్సు
న్యూస్ తెలుగు / వినుకొండ :నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా విద్యా సదస్సు ఆదివారం వినుకొండలోని జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్టిఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా ప్రమాణాల పెంపుదల – ఉపాధ్యాయుల పాత్ర ” అను అంశంపై విద్యాసదస్సు నిర్వహించినట్లు ఎన్ టి ఏ జిల్లా అధ్యక్షుడు కోనూరి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి మాతంగి సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని నిరంతరం విద్యార్థిగా ఉండే ఉపాధ్యాయునికి సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థినీ ,విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయ ప్రవర్తన ఉండాలని, హితవు పలికారు. ఉపాధ్యాయులు దేశ నిర్మాతలని మరియు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో నవభారత నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. టెక్నాలజీ, కంప్యూటర్ విద్య మరియు డిజిటల్ టెక్నాలజీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాజాలవని నొక్కి ఒక్కానించి చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ. ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను విద్యార్థిని, విద్యార్థులకు అందించాలని హితవుపలికారు. బోధనా పద్ధతులు సాంకేతికత జోడించి విద్యార్థులకు బోధించాలని అన్నారు. న్యాయవాది రామకోటేశ్వరరావు, ఏజీపీ ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు, సైదారావు , కె. వెంకట్ , మాదాల రామకృష్ణ ,ఫేక్ జాన్ భాషా , గజవల్లి నాగపవన్ కుమార్ ,యడవల్లి శ్రీనివాస శర్మ , ఎన్ సూర్యనారాయణ , జె .శ్రీనివాసరావు , కొడాలి .శ్రీకాంత్ , ఏ శ్రీనివాసరావు , కొమ్మ శ్రీకాంత్ రెడ్డి , వైవి నారాయణ , షేక్ మస్తాన్ వలి , చిరుమామిళ్ల కోటేశ్వరరావు , గుత్తా గురునాథం , శ్రీనివాసరావు ,అనిల్ కుమార్ రుద్రపాటి ,డి మురళీకృష్ణ , కేజే రమేష్ ,నారాయణ మాస్టారు ,సుభాని , భానుమూర్తి ,సెల్వరాజు రాజా చౌదరి ,శివశంకర్, శ్రీపారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, గద్దె రామకోటేశ్వరరావు, జీవి శేషగిరి , సిహెచ్ రమేష్ ,మురకొండ శ్రీనివాసరావు , హర్యానాయక్, గరికపాటి రవి ,400 మంది ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : పల్నాడు జిల్లాలో విద్యా సదస్సు)