ఫిబ్రవరి 5న 4లేబర్ కోడ్ల అమలు పట్ల
కార్మిక సంఘాల నిరసన
న్యూస్‌తెలుగు/వనపర్తి : కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను అమలును ఆపాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వనపర్తి ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో సిఐటియు, ఏఐటీయూసీ, టి యు ఐ సి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, కార్యదర్శి మోష,టియుసీఐ నేత సి.రాజు మాట్లాడారు. దేశ కార్మికులు దశాబ్దాలుగా పోరాడి కార్మిక చట్టాలను సాధించుకున్నారన్నారు. వాటిని నాలుకోడులుగా విభజించి నిర్వీర్యం చేసిందన్నారు. కోడులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. కోడ్లు అమలు అయితే కార్మికులు సమ్మె చేసే హక్కు, జీతాలు పెంచమని అడిగే హక్కు కోల్పోతారన్నారు. పారిశ్రామిత్తలకు అనుగుణంగా కేంద్రం ఈ చట్టాలను తెచ్చిందన్నారు. పోరాటాల ఫలితంగా అమలులో వాయిదా వేస్తూ వచ్చారని ఇప్పుడు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు దీన్ని నిరసిస్తున్నాయన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి కోడల అమలును ఆపాలని, ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా నిరసన తెలిపాలని కార్మిక సంఘాలు నిర్ణయించారు. అందులో భాగంగా వనపర్తి పాత మార్కెట్ యార్డులో ఫిబ్రవరి 5వ తేదీ 8 గంటలకు నిరసన మొదలవుతుందన్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశ్రీరామ్, ఉప కార్యదర్శి గోపాలకృష్ణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, టి యు ఐ సి నేత గణేష్ నాయకులు రమేష్, డంగు కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : ఫిబ్రవరి 5న 4లేబర్ కోడ్ల అమలు పట్ల కార్మిక సంఘాల నిరసన)