MLC ఎన్నికలలో కూటమి నాయకులందరూ కలిసి పనిచేయాలి
న్యూస్ తెలుగు సాలూరు : రాబోవు MLC ఉపాధ్యాయ ఎన్నికలలో కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు . శనివారం మంత్రి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సాలూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. సాలూరు మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆర్ పి భంజ్ దేవ్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరు సంతోషంగా ఉన్నారని అన్నారు. కూటమి అధిష్టానం ఏ అభ్యర్థనైతే నిలబెడుతుందో ఆ అభ్యర్థికి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తూ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరమేష్. పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్. ముఖి సూర్యనారాయణ. జనసేన నాయకులు శివ బిజెపి నాయకులు భాను పాల్గొన్నారు.(Story : MLC ఎన్నికలలో కూటమి నాయకులందరూ కలిసి పనిచేయాలి )