గుమ్మడి కళా పీఠం కళాకారుల ఆత్మీయ సమావేశం
న్యూస్ తెలుగు /వినుకొండ :“నిద్రలో వచ్చేది కల, నిదురించే జాతిని మేల్కొలిపేది కళ ” అటువంటి కళాకారులు , ప్రజలను వివిధ సమస్యలపై చైతన్య పరచాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్ అన్నారు. వెల్లటూరు రోడ్డు లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో జరిగిన గుమ్మడి కళా పీఠం కళాకారుల ఆత్మీయ సమావేశం సభకు ఏ.మారుతి వరప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా శివశక్తి మేనేజర్ జివి రమణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. ఎన్నుకోబడిన గుమ్మడి కళాపీఠం సభ్యులు మరింతగా కళా ప్రదర్శనలు ఇస్తూ మరింతగా రాణించాలని కోరారు. కళాకారుడు చనిపోతే అదే రోజు మట్టి ఖర్చులకు 3000 రూపాయలు అందజేయాలని గుమ్మడి కళాపీఠం కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కళాకారులను ఒక తాటి మీదకు తీసుకు వస్తున్న గుమ్మడి ఎంతో అభినందనీయుడని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పారెళ్ల కృష్ణ, రావిపాటి వీరయ్య, పారెళ్ల సుబ్రహ్మణ్యం, కీబోర్డు నాగేశ్వరరావు, ముఖ్యని రామయ్య, పారెళ్ళ దత్తు, బొంకూరి అజయ్ కుమార్ లను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల నారాయణ, సుబ్బారావు, కోటిరెడ్డి, వెంకీ నాయక్, రిటైర్డ్ హెచ్ఎం ఈవి. రమణారెడ్డి, అందరివాడు సద్దాం, ఎస్కే కాసిం వలి తదితరులు పాల్గొన్నారు.(Story : గుమ్మడి కళా పీఠం కళాకారుల ఆత్మీయ సమావేశం)