పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ
న్యూస్ తెలుగు/చింతూరు : మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొదట శిక్షణ ఇచ్చి, అనంతరం ఉద్యోగాలు ఇప్పించేందుకు వివరాలు కోరుతున్నారు. ఇన్నో సోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఈ కార్యక్రమ చేపడుతున్నట్లు చింతూరు సి ఐ తెల్లం దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల్లోపు వయసు కలిగి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, మరి ఏదైనా డిగ్రీ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పించబడుతుందని పేర్కొన్నారు. అర్హతను బట్టి విశాఖపట్నం, బెంగళూరు, నర్సాపూర్, కోలార్, టాటా కంపెనీలో పరిధిలో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగం పొందగోరు అభ్యర్థులు విద్యార్హత, ఆధార్ కార్డు, మూడు పాస్పోర్ట్ ఫోటోలు, బయోడేటా ఫారం పూర్తి చేసి సమీప పోలీస్ స్టేషన్ లలోను , 3వ తేదీ చింతూరు పోలీస్ స్టేషన్ లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరుకావాలని కోరారు.(sTORY : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ )