వ్యవసాయేతర భూమిని ఫ్రీజ్ చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : రైతు భరోసా సర్వే సందర్భంగా వనపర్తి జిల్లాలో గుర్తించిన వ్యవసాయేతర భూమిని ఆన్లైన్ లో నిక్షిప్తం చేసి ఫ్రీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో వెబ్ కాందరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జామచేసే ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన ప్రతి రైతుకూ రైతు భరోసా అందేవిధంగా చూడాలన్నారు. రైతు భూమిలోని కొంత భాగం వ్యవసాయం చేస్తూ మరికొంత భాగం వ్యవసాయేతర భూమిగా మార్చిన వాటిని విడదీసి వ్యవసాయ యోగ్యం ఉన్న భూమికి రైతు భరోసా పడాల్సి ఉంటుందన్నారు. దీనికొరకు ఎంత భూమి వ్యవసాయేతర భూమి ఉందో దానిని మాత్రమే ఆన్లైన్ లో ఫ్రీజ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు కూర్చొని సమన్వయంతో ఫ్రీజింగ్ ప్రక్రియ సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డుల విషయంలో ఏదైతే కొత్త దరఖాస్తులు, ఫిర్యాదులు వచ్చాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రేషన్ కార్డుకు అర్హులైన జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తహసిల్దార్ మదన్ మోహన్, అందరూ తహశీల్దార్లు, మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.