అంతర్రాష్ట్ర అఖిలభారత ఒంగోలు జాతి పశు బల ప్రదర్శనను ప్రారంభం
జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణ కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా అంతరాష్ట్ర అఖిలభారత ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన బండలాగుడ పోటీలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. కాసేపు బండలాగుడ పోటీలను వీక్షించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రానున్న రోజులో పశు సంపద పెరగాలని ఆకాంక్షించారు, ఈ ప్రాంత రైతులతో పాటు అనేక ప్రాంత రైతులు ఈ బండలాగుట పోటీలను వీక్షించడానికి వీచేసిన రైతులకు చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధి పెబ్బేర్ రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story ; అంతర్రాష్ట్ర అఖిలభారత ఒంగోలు జాతి పశు బల ప్రదర్శనను ప్రారంభం)