వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌కు చీఫ్ విప్ జీవీ సత్కారం
న్యూస్ తెలుగు/వినుకొండ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌ను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం ఘనంగా సత్కరించారు. బాధ్యతలు తీసుకున్న దగ్గర్నుంచి నిబద్ధతతో చేస్తున్న కృషికి సముచిత గౌరవం లభించిందని అభినందించారు. పల్నాడు జిల్లాలో ఉత్తమ మున్సిపల్ కమిషనర్‌గా సుభాష్ చంద్రబోస్‌ను ఎంపిక చేసి పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. సోమవారం వినుకొండలోని చీఫ్ విప్ జీవీ కార్యాలయంలో జీవిని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలోనే శాలువా కప్పి సన్మానించారు. సుభాష్ చంద్రబోస్ పురపాలక సంఘాన్ని పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ పన్ను వసూళ్లలోనూ పల్నాడు జిల్లాలో వినుకొండ మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. గడిచిన ఏడు నెలలుగా తాము తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పట్టణ పరిధిలో సమర్థంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటున్నారన్నారు.(Story : వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌కు చీఫ్ విప్ జీవీ సత్కారం )