వెలుగు వివోఏల (యానిమేటర్స్ ) బకాయి వేతనాలు చెల్లించాలి
మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ను రద్దు చేయాలి
న్యూస్ తెలుగు/చింతూరు : ఏపీ వెలుగు వివో ఏల యానిమేటర్స్ ఉద్యోగాల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా చింతూరు డివిజన్ పరిధిలో విఆర్ పురం. కూనవరం. చింతూరు.ఎటపాక. వివో సమస్యలు పరిష్కరించాలని. బకాయి వేతనాలు చెల్లించాలని. ఈనెల 27. 28 తేదీలలో చింతూరు ఐటీడీఏ ముందు సిఐటియూ ఆధ్వర్యంలో సామూహిక దీక్షను సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నెలల నుండి బకాయి వేతనాలు చెల్లించాలని . వివోఎ ల ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ల ను రద్దు చేయాలని. రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మంది వివోఏలు పొదుపు సంఘం మహిళలకు దీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం మూడు సంవత్సరాల పని చేసిన వివో ఏ లను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని 2019 నవంబర్ నెలలో సర్కులర్ను జారీ చేశారు. నాటి నుండి నేటి వరకు కాలపరమితి సర్కులను రద్దు కోసం. ఉద్యోగ భద్రత కోసం. హెచ్ ఆర్. పాలసీ అమలు. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం. కల్పించాలని,జండర్ పేరుతో తొలగింపులు ఆపాలని అన్నారు. కూటమి ప్రభుత్వం విఓఎల కాల పరిమితి సర్కులర్ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. సర్కులను రద్దుచేసి వివోఎలా ఉపాధిని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు. పిఎన్ఎం మండల నాయకులు పట్రా రమేష్. వివోఏ లా నాలుగు మండల నాయకులు. గొర్రె లక్ష్మయ్య. రత్తయ్య. దూలమ్మ. రత్నకుమారి. లీలావతి. దుర్గాదేవి. అనసూయ. మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.(Story : వెలుగు వివోఏల (యానిమేటర్స్ ) బకాయి వేతనాలు చెల్లించాలి )