విజయవంతంగా జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడ సంస్కృతిక సమ్మేళన కార్యక్రమాలు
అలరించిన ఆట పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నారుల విచిత్ర వేషధారణ
క్రీడల్లో ప్రతిభావంతులకు భారీ నగదు బహుమానం
జెకె సిటీ జ్ఞాపికలు అందజేత
న్యూస్ తెలుగు/చింతూరు : తెలుగువారి ప్రియమైన పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమా
ల్ ఖాన్ సారధ్యంలో 40 రోజుల పాటు జరిగిన అంతర్రాష్ట్ర క్రికెట్, వాలీబాల్ పోటీలు ఆర్చరీ, ఫుట్బాల్, ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. క్రీడల్లో విజేతలైన వారికి గణ తంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడాకారులకు, కళాకారులకు ప్రోత్సాహకాలను అందజేయడం జరిగింది… జమాల్ ఖాన్ స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు..అనంతరం జరిగిన కార్యక్రమంలో కళ వేదికపై పాల్వంచకు చెందిన ఎస్కే హుస్సేన్ చింతూరు చల్లని పల్లె తల్లి అని పాటను ఆలపించారు. ములుగు జిల్లాకు చెందిన మార్తా రవి పలు చలనచిత్రాల్లోను ఈటీవీ జబర్దస్త్ అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖ ఇంద్ర జాలికుడు అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మండలంలోని భాస్కరా విద్యా నీకేతన్, శాంతి విద్యాసంస్థలకు చెందిన బాల బాలికలు చిన్నారుల ఫ్యాషన్ షో తో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మూడువేల కు పైగా ప్రేక్షకులు హాజరై విజయవంతం గా కొనసాగింది. జమాఖాన్ ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ ఏజెన్సీ నాలుగు మండలాలో నే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో కూడా ట్రస్ట్ ద్వారా అనేకమంది వరద బాధితులకు, అగ్ని బాధితులకు, వికలాంగులకు, అనాధలకు ట్రస్ట్ ద్వారా లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. 2022 నుండి 23 సంవత్సరకాలంలో 31, 40,000 బాధితులకు వస్తు నగదు రూపేనా సహాయం అందజేయడం జరిగిందన్నారు. 2023 నుండి 2020 నాలుగు వరకు సంవత్సర కాలంలో 44 లక్షల 30 వేల రూపాయల ఖర్చుతో వివిధ గ్రామాల్లో బోర్లు వేసి నీటి ఎద్దడిని తీర్చడం జరిగింది. వరద బాధితులకు ఇల్లు కోల్పోయిన వారికి ఇంటి నిర్మాణ సామాగ్రి, నిత్యవసర వస్తువులు బట్టలు వంట పాత్రలతో సహా నగదు పైకాన్ని కూడా అందజేయడం జరిగింది. అర్థ శతాబ్దపు అంధకారాన్ని బ్రిడ్జిపై విద్యుత్ లైట్లను 70 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసి వెలుగులు నింపారని కొనియాడారు. నిర్ణయ సంఘం నడుపుతున్న వృద్ద అనాధ ఆశ్రమాన నిర్మాణానికి 1,50,000 విలువ చేసే పై కప్పును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో త్రాగునీరు సమస్య తెలిపిన అధికారుల మాట ప్రకారం 65 వేల రూపాయల వ్యయంతో మంచినీటి బోరు ఏర్పాటు. మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించడం, వీధిలైట్లు సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారని ఇంకా నాలుగు మండలాల్లో ఏంటి యజమానులు అకాల మరణం చెందిన బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా 5000 రూపాయలను అందజేయటం ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వారికి సొంత ఖర్చులతో జైపూర్ కాళ్ళను ఏర్పాటు చేశారు. ఇలా అనేక సహాయ కార్యక్రమాలపై జమాల్ ఖాన్ ట్రస్ట్ ను వారి సేవలను కొని ఆడారు. అనంతరం లక్కీ డ్రా ద్వారా పలువురికి విలువైన వస్తు వులు వేదికపై అందజేశారు. అనంతరం గోల్డ్ మెడల్ గ్రహీత మధు చందన వెయిట్ లిఫ్టర్ కు గంగాధర్ కు స్థానిక యువత జెకె సిటీ సన్మానం నిర్వహించారు. జమాల్ ఖాన్ను కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెకె సి ట్టి ఎస్కే షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.(Story :
#Separator విజయవంతంగా జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడ సంస్కృతిక సమ్మేళన కార్యక్రమాలు )