30 లీటర్ల నాటు సారా ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్న పోలీసులు
న్యూస్ తెలుగు /సాలూరు: 30 లీటర్ల నాటు సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఒక మహిళను అరెస్ట్ చేసామని సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు ఆదివారం సాలూరు పట్టణం పరిధిలో గల ఎరుకల వీధి జంక్షన్ వద్ద నాటుసారా కల్గి ఉన్నదని సమాచారంతో తనిఖీ చేయగా. ఆమె వద్ద ఉన్న 300నాటుసారా పేకెట్స్ (30లీటర్లు ) స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితురాలు అరెస్ట్ చేసి రెమెండ్ కి తరలించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా మరియు ఇతర మత్తుపదార్దాలు రవాణా చేయడం గాని, కల్గి ఉండడం గాని, నిల్వవుండడం గాని, అమ్మడం గాని చెసినచో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : 30 లీటర్ల నాటు సారా ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్న పోలీసులు)