అర్హులకు సంక్షేమ పథకాలు
– సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య
– కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జంగపెళ్లి అయిలయ్య
న్యూస్ తెలుగు/ సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, అక్కన్నపేట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జంగపెళ్ళి అయిలయ్య అన్నారు.సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో ఆదివారం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డుల పథకాలను మండల ప్రత్యేకాధికారి, ఏడిఏ శ్రీనివాస్, ఎంపిడివో జయరాం నాయక్,తహశీల్దార్ అనంతరెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎంపీవో గుగులోతు మోహన్ వివరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముత్యాల సంజీవరెడ్డి ఉద్గాటించారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగ్గిడి అయిలయ్య, సీడీపీవో జయమ్మ,ఏవో తస్లీమ సుల్తాన,గిర్దావర్లు లింగంపెళ్ళి యాదగిరి,సయ్యద్ జాహీద్ పాషా, గ్రామ శాఖ అధ్యక్షుడు లింగంపెళ్ళి సారయ్య, మాజీ ప్రజాప్రతినిధులు ఏలేటి స్వామిరెడ్డి,బద్దం రాజిరెడ్డి,వేముల శ్రీనివాస్,ఏలేటి నిర్మల, అన్నాడి దినేష్ రెడ్డి, గిరిజన నాయకులు కైలూనాయక్, ధరావత్ తిరుపతి నాయక్,ఏలేటి మోహన్ రెడ్డి,స్థానిక పంచాయతీ కార్యదర్శి సుచరితతో పాటు మండల పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.(Story : అర్హులకు సంక్షేమ పథకాలు)
( Special Story By: NARADAS EASHWAR )