కేశనాయక్ తండాలో పశువైద్య శిబిరం
న్యూస్ తెలుగు/ సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశనాయక్ తండాలో పశుసంవర్ధక శాఖ,పశుగణాభివృ సంస్థ గోపాల మిత్ర ఇంచార్జి వంగ రాంరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గర్భకోష వ్యాధుల చికిత్స శిబిరాన్నీ మండల పశువైద్యాధికారులు సుకన్య, రమేష్ ప్రారంభించారు.ఈ సంధర్భంగా పశు వైద్యాధికారులు పాడి పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులు ఉన్న పశువులకు చికిత్సలు నిర్వహించారు.పాడి పశువుల పాల ఉత్పత్తికై మినరల్ మిక్చర్ ప్యాకెట్లతో పాటు పశువులకు నట్టల నివారణ మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్ర ప్రతినిధులు కుక్కల వినయ్,సందెబోయిన నాగరాజు,జంగపెళ్లి క్రిష్ణ, రైతులు పాల్గొన్నారు. (Story : కేశనాయక్ తండాలో పశువైద్య శిబిరం)
( స్పెషల్ స్టోరీ: నారదాసు ఈశ్వర్ )