శివశక్తి సేవలు సద్వినియోగం చేసుకోండి
న్యూస్ తెలుగు/ వినుకొండ : ప్రజాసేవే లక్ష్యంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శంకర కంటి ఆసుపత్రి సహకారం తో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, సతీమణి లీలావతి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ. గత 30ఏళ్లగా శివశక్తి ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు, నిర్వహిస్తూ పేద ప్రజలను ఆదుకోవడం జరిగిందన్నారు. కంటి చూపు లేక ఇబ్బంది పడుతున్న అవ్వ తాతలకు ఆపరేషన్లు చేయించి కంటి చూపునివ్వడంలో తనకెంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి 2 వేలకు మంది పైగా వృద్ధులు హాజరు కాగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నిశంకర్ శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.(Story : శివశక్తి సేవలు సద్వినియోగం చేసుకోండి)