అంగరంగ వైభవంగా ఆయుర్వేద ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు
హిందూ ముస్లిం భాయి భాయి మనమంతా ఒకటే నోయి
న్యూస్‌తెలుగు/చింతూరు : గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం పరముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ చారిట ట్రస్ట్ చైర్మన్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత జాతీయ జెండాను జమాల్ ఖాన్ ఆవిష్కరించారు. జాతీయ గీతం అనంతరం జమాల్ ఖాన్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి నా తేదీ 19 50 జనవరి 26న సర్వసత్తాక స్వతంత్ర వచ్చిందన్నారు.. స్వతంత్ర పోరాటానికి ఎంతోమంది పోరాట యోధులు ఆంగ్లేయుల ను ఎదుర్కొని అమరులైనారని వారి ప్రాణ త్యాగమే నేడు మనం స్వేచ్ఛ వాయువులనుపీల్చుకుంటున్నమన్నారు. చివరకు శాంతి యుతంగా పోరాడి స్వతంత్రం తెచ్చిన బాపూజీ వంటి వారిని నేడు మరణం చేసుకోవాలని. అలాగే వేల వీరులు బలిదానంతో సిద్ధించిన స్వతంత్ర భారత దేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ చాటాలని ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచి నారు. ఈ కార్యక్రమంలో జెకె సిటీ ట్రస్ట్ కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్, నాధర్ఖాన్, హబీబుల్లాఖాన్, వహీదుల్లా ఖాన్, గఫూర్, ఎస్డి సమీర్, దీప, సుభాని, ఎస్కే షాజహాన్, ఎజాస్అహ్మద్, జాన్ ప్రకాష్, జాన్ సుందర్, విక్కీ, పి సాల్మన్ రాజు, ముత్యాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.(Story : అంగరంగ వైభవంగా ఆయుర్వేద ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు)