రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే
న్యూస్ తెలుగు/వనపర్తి : రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు అన్నారు. ఆదివారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను విజయ రాములు ఆవిష్కరించి మాట్లాడారు. మతతత్వ బిజెపి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని, ప్రజలు ప్రతిఘటించి పోరాడాలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే అంగీకరించేది లేదన్నారు. సంక్షేపతకాలను అందుకునేందుకు అర్హులైన పేదలు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణ, శ్రీహరి, భాస్కర్, కుతుబ్, రాము, మహేష్, లక్ష్మీనారాయణ, చంద్రశేఖరు, లింగస్వామి, మహిళా నాయకులు శిరీష, భూమిక తదితరులు పాల్గొన్నారు.(Story : రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే )