చిన్ననాటి స్కూలుకు సేవ చేయడం అపూర్వ ఆకాశం
న్యూస్ తెలుగు/వనపర్తి : చిన్ననాటి స్కూలుకు సేవ చేయడం నాకు లభించిన అపూర్వ ఆకాశం అని మాజీ కౌన్సిలర్, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు.తెలుగు వాడ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిపి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపాలిటీలో జెండా వందనం తర్వాత తెలుగు వాడ హైస్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలలో పాల్గొని ఘనంగా జెండా ఉత్సవాలు స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిపి జరిపారు.. ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, టిడిపి నాయకులు కొత్తగోల్ల శంకర్, బీసీ సంఘం నాయకులు గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, పెండెం నాగన్న, శరత్ చంద్ర, వెంకటేష్ తదితరులు విద్యార్థులకు వారి నైపుణ్యాలలో తెచ్చుకున్న బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వారు ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు ఘనంగా సన్మానం చేశారు. H.m రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.