కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : 76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు న్యాయమూర్తి యం.మహతి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యం. మహతి మాట్లాడుతూ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం. యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో అగ్ర రాజ్యాంగ నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు మనందరం ఎంతో గర్వకారణంగా భావించాలి. రిపబ్లిక్ డే సందర్భంగా మన భారతదేశం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామిక విలువలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుసుకోవడం అనేది తప్పనిసరి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె ఎస్.ఎం.వి. నాయుడు, సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ గాలి నాగరాజు, జాయింట్ సెక్రటరీ యలవర్తి శ్రీనివాసరావు, కోశాధికారి చీమకుర్తి బ్రహ్మం, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దండే వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు ముప్పాళ్ళ జ్ఞానేశ్వర రావు, సీనియర్,జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది, పోలీసులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు.(Story : కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు)