జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జివి
న్యూస్ తెలుగు /వినుకొండ : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వినుకొండలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. వినుకొండ తాసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఎన్ఎస్పి కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివీ ఆంజనేయులు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు చాక్లెట్లు, మిఠాయిలు పంచారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన నడుస్తుందన్నారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ప్రజలందరూ మననం చేసుకోవాల్సిన సమయం ఇదన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జివి)