వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి మారుతున్న కాలానుగుణంగా యువత వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించి ముందుకు సాగాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని పాలిటెక్నికల్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఆయన జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను వారు శాలువాలతో పూలమాలతో గౌరవంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలను తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులకు ప్రశంసా పత్రాల అందించి సత్కరించారు పలు శాఖల తరఫున రూపొందించిన శకట ఆల ప్రదర్శనను వారు తిలకించారుమైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారు ప్రదర్శించిన వినూత్న ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా ఆధునిక ఉత్పత్తులను తయారు చేయాలని ఎమ్మెల్యే సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి , జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ , మున్సిపల్ చైర్మన్ , వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story : వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించాలి )