Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం

వైసీపీలో కలకలం

న్యూస్ తెలుగు/అమరావతి: వైసీపీ వి.విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌వేదికగా శుక్రవారం ఆయన వెల్లడిరచారు. అటు తన రాజ్యసభ సభ్యత్వానికీ శనివారం(25న) రాజీనామా చేస్తున్నట్లు వెల్లడిరచారు. వైసీపీలో టాప్‌లీడర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి ఉన్న పళంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో చర్చానీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో…చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్‌ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు. రెండుసార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చిన వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్‌ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్‌ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా తనకు విభేదాలు లేవని, పవన్‌ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని స్పష్టంచేశారు.నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో చేశారు. తాను ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదని, వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని, ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉన్నానని వివరించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడిని అని, జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నాని చెప్పారు. అటు విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీకి బలం 7కు తగ్గిపోనుంది.(Story : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!