ఎల్ఐసీ అభ్యున్నతిలో ఏజెంట్ల పాత్ర కీలకం
న్యూస్ తెలుగు/సాలూరు : ఎల్ఐసి కార్పొరేషన్ కు పాలసీదారులకు ఏజెంట్ వారది లాంటివాడని, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఏజెంట్ నిస్వార్ధంగా పనిచేస్తున్నాడని పార్వతీపురం ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చి పాత్రుని రామకృష్ణ అన్నారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలో గల ఏజెంట్ అసోసియేషన్ సొంత బిల్డింగు లో ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవ (APP) డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విశాఖ డివిజనల్ ఎన్నికల అధికారి లాడే స్వరూప్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీగా ఎల్ఐసి అవతరించిందంటే దానికి ప్రధాన కారణం. ఈ సంస్థ యొక్క ఉద్యోగస్తులతో పాటు ఏజెంట్లు ప్రధానపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఏజెంట్ వృత్తి అనేది సామాజిక స్పృహతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. బ్రాంచ్ లోఏజెంట్లు కి ఎటువంటి సమస్యలు వచ్చిన బ్రాంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏజెంట్లు సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం బ్రాంచ్ పరిధిలో అత్యధిక బిజినెస్ చేసిన ఏజెంట్లకు, ఎం డి ఆర్ టి చేసిన ఏజెంట్లకు సీనియర్ ఏజెంట్లకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పార్వతీపురం ఏజెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా లచ్చిపాత్రుని రామకృష్ణ కార్యదర్శిగా మర్రపు నారాయణస్వామి కోశాధికారిగా కొత్తకోట రమేష్. ఉపాధ్యక్షులుగా చెరుకూరు జగదీశ్వరరావు. ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతిపురం బొబ్బిలి సాలూరు ఏజెంట్లు తోపాటు గౌరవధ్యక్షులు చెక్క వెంకట్రావు , పోలిశెట్టి నాగేశ్వరరావు. గుండ్రేటి జగన్నాథం నాయుడు. గొడే గోవిందరావు ,ఏకాంబర స్వామి, నాయుడు సింహాచలం గెoబలి కేశవ రావు, కొర్రాయి తవిటి నాయుడు, రొంపల్లి శంకర్రావు బెలివాడ కనక లింగేశ్వరరావు, బండారు రమేష్, గాడి జగదీశ్వరరావు, తూముల శ్రీనివాసరావు, బరాటం త్రినాథ రావు, సుమారు 250 మంది ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story : ఎల్ఐసీ అభ్యున్నతిలో ఏజెంట్ల పాత్ర కీలకం)