మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి
న్యూస్ తెలుగు/సాలూరు: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం గిరిజన ఉప ప్రణాళిక పథకంలో భాగంగా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ శత శాతం రాయితీతో 6,11,250 చేప పిల్లలను పెద్దగెడ్డ జలాశయంలో విడిచిపెట్టారు. 80 నుండి 100 ఎం.ఎం.సైజుగల కట్లు 40 శాతం, రోహం 50 శాతం,మృగాల చేప పిల్లలు 10 శాతం రిజర్వాయర్ లో వదిలారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ మత్స్యకారుల అభివృద్ధికి పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రతీ మత్స్యకారుడు ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. జిల్లాలో మత్స్య సంపదను అభివృద్ధి పరచాలని సూచించారు. మత్స్యకారులకు అవసరమైన సామాగ్రిని కేటాయించేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య, ఐటీడీఎ నోడల్ అధికారి బి.సత్యన్నారయణ, సాలూరు మత్స్య శాఖ అభివృద్ధి అదికారి వై.శ్రీదేవి, పాచిపెంట మండల టీడీపీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్ బాబు, పాచిపెంట మండల కార్యదరి గండేపు యుగాంధర్, పెద్దగెడ్డ నీటి సంఘం అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం నాయకుడు బర్రి చిన్ని అప్పన్న, కొటికిపేట సర్పంచ్ ఇజ్ఞడ అప్పునాయుడు, కొడికాళ్లవలస మత్స్య కార సంఘం అద్యక్షులు బచ్చల జోగారావు, ఇతర టీడీపీ నాయకులు, మత్స్యకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(Story : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి)