ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర అభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్న ప్రియతమ నాయకుడు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం వినుకొండ మండలం విఠంరాజు పల్లె గ్రామం ఉషోదయ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల నందు కేక్ కటింగ్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని పాఠశాలలో ఉన్న పిల్లలకు పుస్తకాలు, భోజనం స్వయంగా వడ్డించారు. వారి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.(Story : ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు)