వైభవంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
న్యూస్‌తెలుగు/చింతూరు : నారా లోకేష్ జన్మదిన వేడుకలు మండలంలోని చట్టి కూడలి వద్ద గురువారం తెలుగుదేశం కార్యకర్తల మధ్య వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు తెలుగుదేశం నాయకులు జెకే ట్రస్ట్ చైర్మన్ పాల్గొని బర్త్డే కేకును కట్ చేశారు. ఒకరినొకరు స్వీట్స్ పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు. రాబోయే రాజకీయ కాలంలో నారా లోకేష్ ఒక మంచి ఉన్నత స్థానంలో పదవులు అలంకరిస్తారని దేశానికి యువ శక్తి సామర్థ్యాలు ఎంతో అవసరమని ఆ దిశలోనే యువకులైన నారా లోకేష్ రానున్న కాలంలో యువగలం రధసారథి గా రాణించగలరు అన్నారు.ఈ కార్య క్రమం లో తెలుగు దేశం నాయకులు తుర్రం ముత్తయ్య, పి సాల్మన్ రాజు, ముత్యాల శ్రీరామ్, పొదిలి రామారావు, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : వైభవంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు )