తోటపాలెం,వీటి అగ్రహారం పరిధిలో విద్యుత్తు అంతరాయం
న్యూస్‌తెలుగు/విజయనగరం : నగరంలో తోటపాలెం,వీటి అగ్రహారం విద్యుత్తు సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం కలుగునని విజయనగరం అర్బన్ ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.త్రినాధరావు గురువారం తెలిపారు.33/11 కెవి తోటపాలెం సబ్ స్టేషన్ లో గల కొత్త బ్రేకర్ పనులు,
33/11 కెవి ఒంటితాడి సబ్ స్టేషన్ లో నిర్వహణ పనులు మరియు ఫీడర్లు మీద ఉన్న చెట్లు కొమ్మలను తొలగించే క్రమములో మరమత్తు పనులను సరి చేసే సమయంలో తోటపాలెం సబ్ స్టేషన్ పరిధిలో గల బ్యాంక్ కాలనీ, శ్రీరామ్ నగర్, గోపాల్ నగర్, ఇందిరా నగర్, నాగోజీపేట, రైల్వే స్టేషన్ రోడ్, బొత్స పేట,సెంట్రల్ బ్యాంక్ ఏరియా,తిరుమల హాస్పిటల్ ఏరియా, ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా , బాలాజీ నగర్,నాయుడు కాలనీ, సాయి నగర్,నరసింహ నగర్, సిద్దార్ధ నగర్ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా ఒంటితాడి సబ్ స్టేషన్ పరిధిలో గల విటి అగ్రహారం ఇండస్ట్రియల్ ఏరియా కి,వీటి అగ్రహారం, బిసి కాలనీ, ప్రదీప్ నగర్, మజ్జిపేట,రొంగలివీధి, సంతోష్ నగర్, ప్రియానగర్ , దుర్గా నగర్, ఎై జంక్షన్, తదితర ప్రాంతాలలో విద్యుత్ అంతులేని కలుగునని ఇఇ త్రినాధరావు పేర్కొన్నారు. వినియోగదారుల సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.(Story : తోటపాలెం,వీటి అగ్రహారం పరిధిలో విద్యుత్తు అంతరాయం)