జనవరి 23న నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే
న్యూస్ తెలుగు /వినుకొండ : గత 25 సంవత్సరాలుగా వినుకొండ ఆర్టీసీ డిపో లో విధులు నిర్వహిస్తున్న సోమేపల్లి వెంకట సీతారామయ్య వృత్తి రీత్యా కండక్టర్ అయినప్పటికీ, ప్రవృత్తిరీత్యా రాష్టవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ చేతిరాత నిపుణుడు మరియు ఒక మంచి క్యాలిగ్రాఫర్.
కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే తనకున్న తీరిక సమయంలో పలు ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలలకి వెళ్ళి విద్యార్థులకు చేతిరాతలో మెళుకువలు నేర్పిస్తూంటారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చుట ఇతని సేవా గుణమునకు తార్కాణం.. గతం లో పోట్లూరు, శ్యావల్యాపురం, నూజెండ్ల, కొండ్రముట్ల ఉన్నత పాఠశాలలో ఉచితంగా చేతిరాత శిక్షణ తరగతులను నిర్వహించారు.
సీతారామయ్య వద్ద దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు పలు అంతర్జాతీయ, జాతీయ స్థాయి చేతిరాత పోటీల లో పాల్గొని అనేక సార్లు అవార్డులను, రివార్డులను, పలు బహుమతుల ను అందుకున్నారు. గత 2024 సంవత్సరంలో “డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా” అనే అంశం పై పోస్టల్ డిపార్ట్మెంట్ వారు. దేశవ్యాప్తం గా నిర్వహించిన వ్యాసరచన పోటీల లో పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్రస్థాయి లో ప్రధమ బహుమతి ని సాధించి, 25 వేల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. న్యూయార్క్ కు చెందిన హ్యాండ్ రైటింగ్ ఫర్ హ్యూమానిటి’ సంస్థ ప్రతి ఏటా నిర్వహించే “వరల్డ్ హ్యాండ్ రైటింగ్ ‘ పోటీలలో 2019 వ సం॥ లో సీతారామయ్య దగ్గర శిక్షణ పొందిన పొట్టి మణిదీప్ కర్సివ్ రైటింగ్ విభాగము లో పాల్గొని ప్రధమ బహుమతిని సాధించుట విశేషము.
జాతీయస్థాయి చేతిరాత పోటీలు అయిన నేషనల్ పెన్మన్ ఛాంపియన్ షిప్ – ఆగ్రా, ది గ్లోబల్ హ్యాండైటింగ్ అసోసియేషన్ త్రివేండ్రం , నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ – హైదరాబాదు వారు నిర్వహించే పోటీలలో సీతారామయ్య దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం బహుమతులను అందుకుంటూనే ఉన్నారు.
గత డిసెంబరు నెలలో, నరసరావుపేట లో జరిగిన పల్నాడు బాలోత్సవంలో చేతిరాత పోటీలలో ఇతని దగ్గర శిక్షణ తీసుకున్న శర్మ స్కూల్ విద్యార్థులు ఎన్. సుప్రీత ప్రధమ బహుమతిని, జే. ప్రవీణ్ అజయ్ రెడ్డి ద్వితీయ బహుమతిని గెలుచుకొన్నారు. పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవటంలో చేతిరాత పాత్ర ఎంతగానో ఉన్నదని, విద్యార్థులు చిన్నతనము నుంచే అందమైన చేతిరాతకు కృషిచేయాలని, అందమైన చేతిరాత అందరికి సాధ్యమేనని సీతారామయ్య తన విద్యార్థులకు
తెలియజేస్తూ ఉంటారు. (Story : జనవరి 23న నేషనల్ హ్యాండ్ రైటింగ్ డే)