వరికపూడిశెల నిర్మాణాన్ని మరచిన ప్రభుత్వం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచికార్పొరేట్ సంస్థల కు తొత్తులుగా మారాయి..
ఫిబ్రవరి నెలలో ఒరేకపొడిసెల అభివృద్ధి కోసం ఆందోళనలు చేపడతాం..
ఒక లక్ష 20వేల ఎకరాల వ్యవసాయ సాగు భూమికి మేలు జరుగుతుంది..
శంకుస్థాపనలకె పరిమితమైన ముఖ్యమంత్రులు..
సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఎన్నికలకు ముందు వరికపూడి సెల అభివృద్ధి గురించి ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వరకు వరికపూడి సెల గురించి మాట్లాడకపోవడం శోచనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతుకి వ్యవసాయ సాగు కోసం పెట్టుబడిగా 20,000 రూపాయలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని, జగన్ అదా నీతో చేసుకున్న 25 సంవత్సరాల సఖి విద్యుత్ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు అదానితో జగన్ చేసుకున్నవిద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రాంతంలో పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఎలా ఉందని ప్రభుత్వం ధాన్యాన్ని 1740రూపాయలకు కొనుగోలు చేయాలని మధు డిమాండ్ చేశారు. ముందుగా వచ్చిన ధాన్యాన్ని ముందుగా ఆలస్యంగా వచ్చిన ధాన్యాన్ని ఆలస్యంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దళారుల నుండి రైతులను కాపాడాలన్నారు. చంద్రబాబుకి పోలవరం అమరావతి జపం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని మరిచాడని, రాష్ట్రంలోని అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ బాధ్యత అని మధు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచి కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారి ఊడిగం చేస్తున్నాయని వారి విధానాలు మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని మధు హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కే హనుమంత్ రెడ్డి. సిపిఎం పార్టీ వినుకొండ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు. సిపిఎం నాయకులు శివరామకృష్ణ. వెంకటప్పయ్య. పెనుమాల వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు.(Story : వరికపూడిశెల నిర్మాణాన్ని మరచిన ప్రభుత్వం)