రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్
న్యూస్ తెలుగు /వినుకొండ : అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ చిత్రకళా బ్రహ్మోత్సవాల అవార్డుల కార్యక్రమంలో వినుకొండ కు చెందిన వజ్రగిరి జెస్టిస్,
అంతర్జాతీయ చిత్రకళా ప్రధమ బహుమతి, భారత చిత్రకళారత్న బ్రహ్మోత్సవ్ అవార్డు,
మరియు బ్రహ్మోత్హవ ఆర్ట్ లెజెండ్ అవార్డు అందుకున్నారు. సుంకర చలపతి రావు సత్కారం అందుకున్నారు. వినుకొండ సీమకు స్ఫూర్తిప్రదంగా, గర్వకారణంగా నిలిచిన డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ ను వినుకొండ కు చెందిన ప్రముఖ రాజకీయ ప్రముఖులు, లాయర్లు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, చిత్రకారులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. మరెన్నో అవార్డులు రివార్డులు సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. (Story : రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్)